Home Page SliderTelangana

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీని చేస్తారా..?

అధికారం పోయాక బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం మొసలి కన్నీరు కారుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీసీని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చేయగలరా? అని ప్రశ్నించారు. పదేళ్లుగా అధికారంలో ఉండి బీసీలను వంచించిన వారికి ఇప్పుడు బీసీలు గుర్తుకొస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతోపాటు పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోక తన ఉనికిని కాపాడుకోవడం కోసం కపట నాటకం మొదలు పెట్టారన్నారు. బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యలు, ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన చర్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.