Home Page SliderTelangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ కేసు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోసారి మాజీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. బెల్లంపల్లి రామ టాకీస్ వీధిలో ఈనెల 29వ తేదీ రాత్రి ఆరిజిన్ డెయిరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణపై దాడి జరుగగా.. మొత్తం 10 మంది దాడికి పాల్పడ్డారు. పై బాధితుడు ఆ పది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాగంశెట్టి సత్యనారాయణ (సతీష్), కొత్తపెళ్లి శ్యామ్, రాజ్ కుమార్ (సన్నీబాబు)తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు తెలిపారు.