క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
ఫార్ములా- ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ పిటిషన్ పై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. కేటీఆర్ తరపున వాదనలు ముగియగానే కోర్టు లంచ్ విరామం ప్రకటించింది. బ్రేక్ అనంతరం తిరిగి ప్రారంభమైన వాదనల్లో ఏసీబీ తరపున ఏజీ ఎ.సుధాకర్ రెడ్డి, ఫిర్యాదుదారు దానకిశోర్ తరపున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

