‘డార్లింగ్స్’ అంటూ అభిమానులకు ప్రభాస్ సందేశం
‘తెలంగాణ ప్రభుత్వానికి సపోర్టుగా మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ అభిమానులకు సందేశం ఇచ్చారు హీరో ప్రభాస్. “డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?” అంటూ ప్రశ్నించారు. మనల్ని ప్రేమించేవాళ్లు ఉన్నారని, మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దని హితవు చెప్పారు. లైఫ్‌లో మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, వాటిని నెరవేర్చడంలో డ్రగ్స్ చాలా ఆటంకంగా మారతాయని పేర్కొన్నారు. మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్‌కు బానిసగా మారారని తెలిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్( 8712671111) కు కాల్ చేయమని విజ్ఞప్తి చేశారు.