Home Page SliderTelanganatelangana,Trending Today

‘జనవరి ఫస్ట్‌ని మనపై రుద్ది వెళ్లారు’..రాజాసింగ్

కొత్త సంవత్సరం పేరుతో జనవరి ఫస్ట్‌ని బ్రిటిష్ పాలకులు మనపై రుద్ది వెళ్లారని బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అసలు మన కొత్త సంవత్సరం అంటే ఉగాది పర్వదినమని పేర్కొన్నారు. న్యూ ఇయర్ పేరుతో భవిష్యత్ తరాలకు విదేశీ కల్చర్‌ను అలవాటు చేస్తున్నారని, ఈ పేరుతో క్లబ్బులు, పబ్బులకు వెళ్లడమేనా మన సంస్కృతి అంటూ మండి పడ్డారు. రకరకాల ఈవెంట్స్ పేరుతో హిందువులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.