తెలంగాణ మంత్రులకు గుడ్‌న్యూస్..
తిరుమల విఐపీ దర్శనాలు, సిఫార్సు లేఖల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై కూడా వారానికి 4 సార్లు తిరుమలలో దర్శనాలు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై రెండు సార్లు వీఐపీ బ్రేక్, రెండు సార్లు రూ.300 టికెట్‌పై అనుమతిస్తామని పేర్కొన్నారు. గతంలో చాలామంది తెలంగాణ మంత్రులు తిరుమలకు వచ్చి తమకు దర్శనాలలో ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.