ఏపీకి కొత్త సీఎస్ నియామకం..
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ నియమింపబడ్డారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగియనుండడంతో ఆయన స్థానంలో విజయానంద్‌ను నియమించారు. ఆయన వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారి పల్లెకు చెందిన వారు. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో ఎండీగా దీర్ఘకాలం పనిచేశారు. రంగారెడ్డి జిల్లా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు.