అమెరికా మాజీ అధ్యక్షుడు మృతి
యుఎస్ఏ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి చెందాడు.ఆయన వయసు 100 సంవత్సరాలు.అమెరికా 39వ అధ్యక్షునిగా పనిచేశారు.జార్జియాలోని ఫ్లెయిన్స్‌లో ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్ కార్టర్ తెలిపారు. జిమ్మీ మృతి పట్ల ఆ దేశ కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధమ మహిళ జిల్, మాజీ అధ్యక్షులు బారక్ ఒబామా, జోబైడెన్ తదితరులు సంతాపం ప్రకటించారు.జిమ్మీ కార్టర్ అమెరికా శాంతి స్థాపన,స్వేచ్చాయుత ఎన్నికలు, యూఎస్ఏ సమగ్రాభివృద్దికి విశేషంగా కృషి చేశారు.ఈయన అంత్యక్రియలను అధికార లాంఛనలతో నిర్వహించనున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు పేర్కొన్నాయి.

