Home Page SliderInternationalSports

కోహ్లీ ఫీజులో కోత‌

విన‌మ్రంగా ఉండే క్రికెట‌ర్ వివాదాల బారీన ప‌డుతున్నాడు. ర‌న్స్ మెషీన్‌కి సైతం పెనాల్టీలు ప‌డుతున్నాయి.ఆస్ట్రేలియా లో జ‌రుగుతున‌న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆటలో ఆసీస్​ బ్యాటర్ కాన్‌స్టాస్‌- విరాట్ కోహ్లీ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో త‌ప్పు కోహ్లీదే అని తేల్చిన ఐసిసి ప్ర‌ధ‌మ త‌ప్పు కింద ప‌రిగ‌ణించి మ్యాచ్ ఫీజ్ కోత‌తో స‌రిపెట్టింది. ఈ వ్యవహారంలో విరాట్, నిబంధన లెవల్ 1ను ఉల్లంఘించినట్లు భావించిన ఐసీసీ అతడికి మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్​ కూడా విధించింది.మ్యాచ్​లో బుమ్రా వేసిన 11వ ఓవర్‌లో ఈ వాగ్వాదం జరిగింది. ఆ ఓవర్​లో మూడు బంతులు ముగిసిన తర్వాత, బాల్ కోహ్లీ వద్దకు వెళ్లింది. అయితే దానిని తీసుకుని విరాట్ నాన్‌స్ట్రైకర్‌ వైపు వస్తున్న సమయంలో కాన్‌స్టాస్‌ స్ట్రైకింగ్‌ క్రీజ్‌ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఎదురుపడ్డారు. ఒకరి భుజం మరొకరి తాకింది. దీంతో కాన్‌స్టాస్‌ ఏదో వ్యాఖ్యలు చేయడం వల్ల కోహ్లీ కూడా అతడికి దీటుగా స్పందించాడు. ఈ విషయంపై అక్కడ కొంతసేపు వాగ్వాదం నెలకొనగా, అక్కడే ఉన్న ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.