పట్నంకి హైకోర్టులో భారీ ఊరట
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లగచర్ల ఘటనకు ముందే బొంరాస్ పేటలో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు చేయకుండా బెయిల్ ఇవ్వాలని నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారించిన హైకోర్టు.. బెయిల్ మంజూరు చేయడంతో పాటు విచారణకు సహకరించాలని పట్నం నరేందర్ రెడ్డిని ఆదేశించింది. అయితే లగచర్ల దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు.

