‘కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం’..రేవంత్ రెడ్డి
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ పదేళ్లు కష్టపడి కాళేశ్వరం కాదు కూలేశ్వరం కట్టాడన్నారు. రెండుసార్లు సీఎంగా ఉండి విధ్వంసం సృష్టించాడని మండిపడ్డారు. వందేళ్లకు సరిపడా విధ్వంసం చేసి, వెయ్యేళ్లకు సరిపడా సంపాదించారని ఎద్దేవా చేశారు. మొత్తంగా తమ ప్రభుత్వానికి కానుకగా రూ.7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని విమర్శించారు. కాంట్రాక్టర్ల దగ్గర పనులు చేయించుకుని బిల్లులు చెల్లించలేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు. అబద్దాలు చెప్పి పదేళ్లూ నెట్టుకొచ్చారని, అబద్దాల సంఘానికి అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా ఉపాధ్యక్షుడిని పంపించాడని ఎద్దేవా చేశారు.