జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన క్యాతం మల్లేశం అనే వ్యక్తి గత 15 రోజుల క్రితం అత్యాచారం కేసులో రిమాండ్ ఖైదీగా జగిత్యాల సబ్ జైలులో చేరాడు. ఈరోజు తెల్లవారుజామున మల్లేశం గుండెపోటుతో ఇబ్బంది పడటంతో అధికారులు సబ్ జైలు నుంచి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే మల్లేశం మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం చేయటంతోనే మృతి చెందాడని ఆరోపించారు. నిందితుడు మల్లేశంకు ఇప్పటికే బైపాస్ సర్జరీ కాగా, మరోసారి గుండెపోటు రావటంతో మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు.