Breaking NewscrimeHome Page SliderNational

ఈ న‌గ‌రానికి ఏమైంది..ఒక‌వైపు పొగ మ‌రో వైపు మంచు

ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది అనే సంచ‌ల‌నాత్మ‌క యాడ్ ఫ‌స్ట్ ఢిల్లీలోనే ప్లే చేశారు.అది కేవ‌లం యాడ్ అయిన‌ప్ప‌టికీ…ఢిల్లీని యాదృచ్ఛికంగా పొగ అయితే క‌మ్మేసింది.ఇప్ప‌డు ఢిల్లీవాసులంతా …ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది అనుకుంటూ దిగ్బ్రాంతికి లోల‌వుతున్నారు.అవును… ప్ర‌స్తుతం ఢిల్లీని న‌లు దిక్కులా పొగ క‌మ్మేసింది. దీనికి తోడు అస‌లే చలికాలం కావ‌డంతో పొగ మంచుతో పాటు కాలుష్య పొగ కూడా క‌లిసి ఢిల్లీ వాసుల‌ను ఊప‌రిస‌ల‌ప‌నివ్వ‌కుండా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. హైకోర్టు ఎన్ని సార్లు ఆదేశాలిచ్చినా పొగ‌ను కంట్రోల్ చేయ‌డంలో పాల‌కులు విఫ‌ల‌మౌతూనే ఉన్నారు.గురువారం విజిబిలిటి 500 మీటర్ల‌కు ప‌డిపోయింది.విమాన,వాహ‌న‌,రైళ్ల‌ రాక‌పోక‌లకు తీవ్ర ఆటంకం ఏర్ప‌డింది. కాలుష్య నియంత్రణకు GRAP-4 చర్యలు చేప‌ట్టారు. సివియర్‌ ప్లస్‌ కేటగిరిలో ఢిల్లీ వాయుకాలుష్యం ఉంది. 448 పాయింట్లకి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ చేరిపోయింది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు బ‌య‌ట తిర‌గొద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు.