ఫోన్ చూస్తుందని స్టూడెంట్ కి కొట్టిన అధికారిణి
హాస్టల్ లో వసతులపై ఆరా తీసేందుకు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆకస్మికంగా వెళ్లారు. ఆఫీసర్ వచ్చిన సమయంలో విద్యార్థిని మొబైల్ ను చూస్తుందని కోపంతో అధికారిణి చితకబాదింది. ఈ ఘటన సూర్యాపేట బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని సూర్యా పేటలో పారా మెడికల్ ఫస్ట్ ఇయర్ లో చదువుకొంటోంది. ఆఫీసర్ వచ్చిన సమయంలో విద్యార్థిని మొబైల్ ఫోన్ చూస్తూ ఆఫీసర్ ను గమనించకపోవడంతో నమస్తే పెట్టావా.. అంటూ ఊగిపోతూ విద్యార్థినిని జుట్టు పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టింది. అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వద్దని వారించారు. ఇంతలో వార్డెన్ వచ్చి అధికారిణిని అక్కడి నుండి పంపించారు.

