Home Page SliderNationalPolitics

షిండేకు షాకిచ్చిన బీజేపీ..

మహారాష్ట్రలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలోని శివసేనకు గట్టి షాక్ తగిలింది. శివసేన నేత, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆశిస్తున్న హోం శాఖ వారికి దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్  ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, నడ్డాలతో చర్చ జరిపారు. డిసెంబర్ 14నాటికి విస్తరణ చేయాలని నిర్ణయించారు. ఈ చర్చల్లో కీలక విషయాలు ప్రస్తావించారు.  కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి 22 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలను బీజేపీ గుప్పిట్లోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శివసేనకు అర్భన్ డెవలప్‌మెంట్ శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనితో శివసేన నేతలలో టెన్షన్ నెలకొంది.