మోహన్ బాబుపై కేసు నమోదు..
కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు భౌతిక దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే పలు జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ ప్రముఖులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులపై దాడి కేసులో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదైంది. పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు కవరేజ్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో భౌతిక దాడి చేశారు. ఓ ఛానల్ రిపోర్టర్ చేతిలో నుంచి మోహన్ బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు.