ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బాంబు బెదిరింపులతో ఢిల్లీలోని రెండు స్కూళ్లు గజగజవణికాయి. గతంలోనూ ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చినా పట్టించుకోలేదు.అయితే గుర్తు తెలియని అగంతకుడు ఢిల్లీలోని ఆర్కేపురంలో ఇవాళ ఉదయం 7 గంటలకు ఈ మెయిల్స్ ద్వారా రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపులు చేయడంతో సిబ్బంది విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశారు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాంబు స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.డాగ్ స్క్వాడ్ తోనూ తనిఖీలు చేపట్టారు.బాంబులు లేవని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఇలా ఈ మెయిల్స్ పెట్టి బెదిరింపులకు పాల్పడిన వారెవరనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.విద్యార్ధులు ఆకతాయితనంగా చేశారా లేదా పాఠశాల సిబ్బంది ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

