మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం..మంటల్లో వాహనాలు
హైదరాబాద్ మెట్రో ట్రైన్ స్టేషన్ వద్ద హఠాత్తుగా మంటలు చెలరేగాయి. నగరంలోని మలక్ పేట మెట్రో వద్ద పిల్లర్ 1409 వద్ద మంటలు చెలరేగి ఐదు బైకులు కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో మెట్రో స్టేషన్‌కు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చాదర్ ఘాట్ నుండి దిల్ సుఖ్ నగర్, కోఠి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా. ఎవరైనా కావాలని చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మలక్ పెట్ మెట్రో స్టేషన్ వద్ద అక్రమంగా బైక్‌లు పార్క్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కంప్లైంట్ నమోదు చేశారు.