సంధ్య థియేటర్ ఓనర్ పై కేసు నమోదు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి పుష్ప -2 బెనిఫిట్ షో సినీ హీరో అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అభిమానులు ఒక్కసారిగా థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు రావడంతో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని పోలీసులు విద్యానగర్ లోని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించగా రేవతి అప్పటికే మృతి చెందింది. బాలుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.

