crimeHome Page SliderSpiritualtelangana,

కైలాసయాత్ర పేరుతో కుచ్చుటోపీ..

ఉత్తర భారతదేశ యాత్రలు తక్కువ ధరలకే చేయిస్తామని, మానస సరోవరం, కైలాస యాత్రకు కూడా తీసుకెళ్తామని నమ్మించి యాత్రికులకు  కుచ్చుటోపీ పెట్టారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. రూ.3వేలకే యాత్రకు తీసుకెళ్తామని చెప్పి 500 మందిని మోసం చేశారు నిర్వాహకుడు భరత్ శర్మ. హైదరాబాద్ ఉప్పల్‌లో ఈ ఆఫీస్ ఉంది. గతంలో కూడా ఒక్కొక్కరివద్ద లక్ష రూపాయలు తీసుకున్నారని, నవంబర్‌లో టూర్‌కు తీసుకెళ్తామని చెప్పి, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పెట్టుకున్నారని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దీనితో భరత్‌శర్మను అరెస్టు చేశారు.  ఇటీవలే నోయిడాలోని కంట్రీ హాలిడే ట్రావెల్ ఇండియా పేరుతో ఉన్న సంస్థ కూడా ఘరానా మోసానికి పాల్పడింది. 9 రోజుల లగ్జరీ ట్రిప్ పేరుతో భారీగా మోసం చేశారు. ఇలాంటి ట్రావెల్స్‌లో టూర్‌కి బుక్ చేసుకున్నప్పుడు అన్ని రకాలుగా పరీక్షించుకోవాలని పోలీసులు సలహా ఇస్తున్నారు.

BREAKING NEWS: ‘పుష్ప- 2’ ప్రీరిలీజ్ ఈవెంట్..హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు