ఏపిలో రేపటి నుంచి విద్యుత్ చార్జీల మోత
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌ని అమలు పరచకపోగా ప్రజల నడ్డివిరిచేలా విద్యుత్ చార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఈఆర్సీ (ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమీషన్) ఇచ్చిన ప్రతిపాదన ఫైల్ పై కూడా సీఎం సంతకం చేశారు.ఇక ఆదివారం నుంచే విద్యుత్ చార్జీలను పెంచనున్నారు.సంపద సృష్టించడమంటే ప్రజలపై పన్నుల భారం వేయడమే అన్నట్లుగా పాలన సాగిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.విద్యుత్ చార్జీలను ఎట్టిపరిస్థితుల్లో పెంచబోమని 2024 ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన పవన్,చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడీ పెంపు చార్జీలకు ఏం సమాధానం చెప్తారని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.


 
							 
							