శ్రీలంక 42/10
శ్రీలంక క్రికెట్ టీం టెస్ట్ హోదా పొందాక అత్యంత చెత్త రికార్డును గురువారం నమోదు చేసింది.సౌత్ ఆఫ్రికా టూర్లో ఉన్న శ్రీలంక టీం…తొలి టెస్ట్‌లో భాగంగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.సఫారీలను 191కే ఆలౌట్ చేసింది.అనంతరం ఇన్నింగ్స్ ని ప్రారంభించిన శ్రీలంక జట్టు కేవలం 42 పరుగులకే కుప్పకూలింది.శ్రీలంక టీంకి టెస్ట్ హోదా లభించాక అంతర్జాతీయ వేదికలపై ఏ ఫార్మాట్ లో చూసి అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇదే తొలిసారి. గతంలో న్యూజిలాండ్(26),సౌత్ ఆఫ్రికా(30),ఆస్ట్రేలియా(36),ఇండియా(36) లు ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్ కే అలౌట్ అయిన జాబితాలో కొనసాగుతుండా ఇప్పుడు శ్రీలంక కూడా చేరింది.