Breaking NewscrimeHome Page SliderTelangana

అయ్య‌ప్ప‌భ‌క్తునికి బ్రీత్ ఎన‌లైజ‌ర్‌

మాలాధార‌ణ చేసిన భ‌క్తునికి బ్రీత్ ఎన‌లైజ‌ర్ ఇచ్చిన ఘ‌ట‌న‌పై దుమారం రేగింది.తొర్రూర్ ఆర్టీసి డిపోలో ప‌లువురు డ్రైవ‌ర్లు అయ్య‌ప్ప‌మాలాధార‌ణ చేసి విధుల‌కు హాజ‌ర‌వుతూ ఉన్నారు.ఇందులో భాగంగా డ్యూటీ కి హాజ‌ర‌య్యేవారిని విధిగా బ్రీత్ ఎన‌లైజ‌ర్‌తో టెస్ట్ చేస్తారు.అలా చేయ‌కుండా ఎవ‌రిని డ్రైవ‌ర్ విధుల‌కు అనుమ‌తించ‌రు.అయితే అయ్య‌ప్ప మాలాధార‌ణ చేసిన వ్య‌క్తులు ఎంతో నియ‌మ‌నిష్ట‌ల‌తో ఉంటార‌నేది అంద‌రికి విధిత‌మే.అయితే తొర్రూర్ డిపో అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి ఓ అయ్య‌ప్ప భ‌క్తునికి బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్ట్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు.అయ‌ప్ప‌స్వాములు మ‌ద్యం సేవించ‌ర‌నే స్పృహ కూడా లేకుండా టెస్ట్ చేశాడు.ఈ ఘ‌ట‌న‌ను తోటి ఉద్యోగి ఫోటో తీసి ఫిర్యాదు చేశాడు.అయ్య‌ప్ప‌మాలాధార‌ణ భ‌క్తుల‌ను టెస్ట్ చేయ‌డ‌మంటే అవ‌మానించ‌డ‌మే అంటూ ఆందోళ‌న‌కు దిగారు. అంతా క‌లిసి బ‌స్సుల‌ను బ్రేక్ డౌన్ చేశారు.దీంతో డిపో మేనేజ‌ర్ ప‌ద్మావ‌తి దిగివ‌చ్చి..బాధ్యులైన‌ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీనివ్వ‌డంతో డ్రైవ‌ర్లు ఆందోళ‌న విర‌మించి బ‌స్సులెక్కారు.