సామూహిక అత్యాచార ఘటనపై టాప్ లెస్ నిరసన
లైంగిక హింస, అసమానతలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో వేలాదిమంది మహిళలు అర్ధ నగ్నంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారికి మద్దతుగా పురుషులు కూడా రోడ్డెక్కారు. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ ముందు మహిళలు టాప్ లెస్ గా ప్రదర్శన నిర్వహించారు. గిసెల్ పెలికాట్ అనే మహిళపై ఆమె మాజీ భర్త సహా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. లైంగిక హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. లైంగిక దాడులు, అసమానతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘మహిళలపై యుద్ధాలు ఆపండి’, ‘మహిళలకు జీవన స్వేచ్ఛ కల్పించండి’ అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. లైంగిక నేరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, పునరుత్పత్తి హక్కులను రక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

