Home Page SliderNational

ప్రియాంక గాంధీకి సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

వయనాడ్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఇవాళ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా ఆమెను స్వయంగా కలిసి అభినందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేయనున్నారు.