సీఎం రేసు నుండి షిండే ఔట్
మహారాష్ట్ర ఎన్నికలలో మహాయుతి కూటమి గెలుపొందడంతో గత రెండు రోజులుగా మూడు ముక్కలాట మొదలయ్యింది. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చలు మొదలయ్యాయి. అయితే వీటన్నింటికీ తెర దించుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా ముంబయికి ఎవరూ రావొద్దని, సమావేశాలు పెట్టొద్దని ట్వీట్ చేయడంతో ఆయన స్వచ్ఛందంగా రేసు నుండి తప్పుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనితో ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి లాంఛనం అయిపోయింది. ఇప్పటికే ఎన్సీపీ నుండి అజిత్ పవార్ ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త సీఎం లేకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. నేటితో ప్రస్తుత అసెంబ్లీ గడువుకాలం ముగుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైతే షిండేను ఆపద్దర్మ సీఎంగా కొనసాగమని గవర్నర్ కోరవచ్చు.
BREAKING NEWS: విషాహారం తిని విద్యార్ధిని మృతి

