లొంగిపోయిన లగచర్ల నిందితుడు సురేష్
లగచర్ల ఘటనను తెలంగాణ రాష్ట్ర సమస్యగా మార్చిన వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న బీఆర్ ఎస్ నేత భోగమోని సురేష్ ఎట్టకేలకు లొంగిపోయాడు.వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా కంపెనీ ఏర్పాటు అభిప్రాయ సేకరణ విషయంలో తలెత్తిన వివాదంలో కలెక్టర్ సహా పలువురు రెవిన్యూ అధికారులపై రైతుల ముసుగులో దాడి చేసిన సంగతి తెలిసిందే.ఇందులో ప్రధాన పాత్ర వహించిన బీఆర్ ఎస్ నేత భోగమోని సురేష్ ను పోలీసులు ఏ2గా చేర్చారు.ఆనాటి నుంచి నేటి వరకు అతను పరారీలో ఉన్నాడు.అనూహ్యంగా మంగళవారం ఉదయం పరిగి పోలీస్ స్టేషన్ లో సురేష్ లొంగిపోయాడు.దీంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరచగా ..న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

