Home Page SlidermoviesNational

నయనతారకు సినీ ప్రముఖుల అభినందనలు

నయనతార జీవిత కథ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. నవంబర్ 18న నయనతార పుట్టినరోజు సందర్భంగా దీనిని రిలీజ్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ దీనిపై స్పందిస్తూ.. బలమైన మహిళను మరింత శక్తివంతంగా చూడడం స్పూర్తి కలిగించిందని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్టార్ హీరో మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో హార్ట్ సింబల్స్‌తో స్పందించారు. దీనికి నయనతార రిప్లై ఇస్తూ మీకు ఈ డాక్యుమెంటరీ నచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. హీరోయిన్ సమంత శక్తివంతమైన మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ పేర్కొంది. థ్యాంక్యూ స్ట్రాంగెస్ట్ గర్ల్ అని నయన్ రిప్లై ఇచ్చింది. ఈ డాక్యుమెంటరీలో నయన తార కెరీర్, వృత్తి, వ్యక్తిగత జీవితాలలోని ముఖ్య అంశాలను తెరకెక్కించారు.