Home Page SliderNationalPolitics

రాష్ట్రపతిని కలిసే వరకూ తిరిగి వెళ్లేది లేదు..

బీఆర్‌ఎస్ పార్టీ నేతల సహాయంతో ఢిల్లీకి చేరిన లగచర్ల బాధితులు రాష్ట్రపతి ద్రౌపదిముర్మును కలవాలని కోరుకుంటున్నారు. వారు రాష్ట్రపతిని కలిసి తమ గోడు వినిపించాలని, అప్పటి వరకూ ఢిల్లీలోనే ఉంటామని చెప్తున్నారు. లగచర్లలో తమ గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళహక్కులు, మానవ హక్కుల కమిషన్‌లను కలిసి ఇప్పటికే వారు తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు బలవంతపు భూసేకరణ, పోలీసుల దుర్మార్గాలను గురించి రాష్ట్రపతికి విన్నవించాలని అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం.