టన్నులకొద్దీ చేపలతో మత్స్యకారులు ఖుషీ
వరంగల్ భద్రకాళి చెరువు నిన్నటివరకూ నిండుకుండను తలపించింది. కానీ గుర్రపు డెక్క, వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో చెరువుకు గండి కొట్టి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. పూడిక తీత కోసం చెరువును ఖాళీ చేశారు. దానితో టన్నులకొద్దీ చేపలు చెరువులో మిగిలిపోయాయి. దీనితో చాలా ఈజీగా చేపలు దొరికాయంటూ మత్స్యకారులు ఖుషీ అవుతున్నారు. మత్స్యకారులు చేపలు పడుతూ పండుగ చేసుకుంటున్నారు.