రేవంత్ సవాల్ స్వీకరణ.. అక్కడే బస చేయనున్న నేతలు
సీెం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించి.. తెలంగాణ బీజేపీ నేతలు పూనుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు నేడు బస చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు బస చేయనున్నారు. రాత్రి భోజనంతో పాటు నిద్ర, ఆ మరుసటి రోజు అల్పహారం కూడా అక్కడే చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 20 ప్రాంతాల్లో 20 మంది నేతలు బస చేయబోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని మనోధైర్యం ఇవ్వనున్నారు. అంబర్ పేట్ లోని తులసీరామ్ నగర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్ పేట్ లోని శాలివాహననగర్ లో ఎంపీ కే.లక్ష్మణ్, ఎల్బీనగర్ లోని గణేష్ నగర్ లో ఈటల రాజేందర్, రాజేంద్రనగర్ లోని హైదర్ష్ కోట్ లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అఫ్జల్ గంజ్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస చేయనున్నారు.

