ఆలయంలో మంటలు.. పూజారికి గాయాలు
నల్గొండ జిల్లా నకిరేకల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గర్భగుడి దీపంలో ఆలయ పూజారి నూనెకు బదులుగా పెట్రోల్ పోశాడు. దీంతో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. మంటలకు అర్చకుడు దీక్షితులు తీవ్రంగా గాయపడ్డపడ్డారు. టెంపుల్ లో ఉన్న శివ భక్తులు గమనించి పూజారిని నకిరేకల్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గర్భగుడిలో క్లీన్ చేయడానికి సిబ్బంది పెట్రోల్ ను తీసుకు వచ్చిన్నట్లుగా తెలుస్తోంది.

