Home Page SliderTelangana

లగచర్ల ఘటనపై సీఎం బాధ్యత వహించాలి..

లగచర్ల గ్రామంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శించారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమలు తీసుకురావడంలో తప్పులేదు కానీ రైతులకు ఇష్టం లేనప్పుడు అక్కడ భూసేకరణ ఆపి వేయాలని కోరారు. సీఎం అన్న తిరుపతిరెడ్డి కలెక్టర్ ను పరామర్శిస్తే ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య రాదు.. కానీ ఒక ఎంపీ అయిన తాను కలెక్టర్ ను పరామర్శించడానికి వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందా? అని ప్రశ్నించారు. మన్నెగూడ దగ్గర పోలీసులు తమను 40 నిమిషాలు ఆపారని డీకే అరుణ ఫైర్ అయ్యారు.