ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో బుధవారం రాత్రి ఎవరూ లేని సమయం చూసుకుని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందినవాడని సమాచారం. విషయం తెలుసుకున్న కాలేజి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని నిజాంపేట ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు.