Andhra PradeshHome Page SliderPolitics

‘పవన్ సొంత డబ్బిచ్చినా డయేరియా లేదంటారే’..బొత్స

ఏపీ శాసన మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణ విజయనగరంలో డయేరియా మరణాలపై ప్రశ్నించారు. దీనికి మంత్రి సత్యకుమార్ సమాధానం చెపుతూ డయేరియాతో ఎవరూ చనిపోలేదన్నారు. దీనిపై ఫైర్ అయ్యారు బొత్స. 10 మంది డయేరియాతోనే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  గ్రామంలో సమావేశం పెట్టి, వారికి సహాయార్థం తన సొంత డబ్బు తీసి ఇచ్చారని గుర్తు చేశారు. అయినా కూడా మంత్రి ఒప్పుకోవట్లేదని ఎద్దేవా చేశారు. అయితే మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి కూడా ఆ ప్రాంతాలలో పర్యటించలేదన్నారు. అందుకే వెనుకబడిపోయాయని, అక్కడ డ్రైనేజీ నీరు, మంచినీరు కలిసి డయేరియా వచ్చిందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అంతేగానీ, జగన్ ట్వీట్ చేయడం వల్లే సహాయం అందలేదు, డిప్యూటీ సీఎం ధాతృత్వం చూపించారని మంత్రి బదులిచ్చారు.