Home Page SliderInternationalNewsSports

న్యూజిలాండే అధ్వాన్న‌మ‌నుకుంటే దాని కంటే ప‌ర‌మ చెత్త టీంలా శ్రీ‌లంక‌

పేరుకే T20I… కానీ గ‌ల్లీ స్థాయి క్రికెట్ ని కూడా ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నారు. 120 బాల్స్ ని కూడా ఎదుర్కోలేక కుప్ప‌కూలిపోతున్నారు. మినిమం 160 ప్ల‌స్ స్కోర్ ని కూడా చేయ‌లేక చ‌తికిల‌ప‌డిపోతున్నారు.ఇలాంటి ఆట‌గాళ్ల‌ను అంత‌ర్జాతీయ టీంల‌లోకి ఎందుకు పంపుతున్నారు స్వామి అంటూ క్రికెట్ అభిమానులు,విశ్లేష‌కులు నిట్టూరుస్తున్నారు.తాజాగా శ్రీ‌లంక టూర్‌లో ఉన్న న్యూజిలాండ్ టీం ప‌ర‌మ చెత్త రికార్డుల‌ను న‌మోదు చేస్తుంది. రెండు T20 ల సిరీస్ లో భాగంగా మొద‌టి మ్యాచ్‌లో 135 ప‌రుగుల‌కే ఆలౌట్ కాగా రెండో టీ20లో 108 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది.అయితే మొద‌టి మ్యాచ్‌లో శ్రీ‌లంక గెలుపొంద‌గా, రెండో మ్యాచ్‌లో శ్రీ‌లంక ఆట‌గాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఛేజింగ్‌లో కేవ‌లం 103 ప‌రుగులే చేసి ఆలౌట్ అయ్యారు.ఇలాంటి చెత్త ఆట‌గాళ్ల‌ను అస‌లు అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు ఎందుకు పంపుతారో తెలీదు….వీళ్ల‌కంటే జీహెచ్ ఎంసి కార్మికుల రికార్డులు న‌య‌మ‌నిపిస్తున్నాయ‌ని క్రికెట్ అభిమానులు విమ‌ర్శిస్తున్నారు.