సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమవడమే కాకుండా… గత ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను పూర్తి చేశామని మహారాష్ట్ర వెళ్లి అసత్యాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు. 18 నెలల తర్వాత ప్రారంభించబోయే మూసి నది ప్రక్షాళన చర్యల మీద ఇప్పుడే విమర్శలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. మూసినది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాంచాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన పేరుతో ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారా అని సూటిగా ప్రశ్నించారు.రూ.1.50లక్షల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఇంతటి అసమర్ధ ముఖ్యమంత్రిని తానెన్నడూ చూడలేదన్నారు.ఇకనైనా రెచ్చగొట్టే మాటలు,అబద్దాలు మానుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

