హిందీ యువనటుడు ఆత్మహత్య
హిందీ యువనటుడు నితిన్ చౌహాన్(35) ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. గురువారం ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. తమ స్నేహితుడు ఇలా చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని సంతాపం తెలిపారు. యూపీకి చెందిన నితిన్ బాలీవుడ్ చిత్రాలలో నటించే ప్రయత్నాలలో ఉన్నారు. జిందగీ డాట్ కామ్, క్రైమ్ పెట్రోల్, స్ప్లిట్స్ విల్లా5 లాంటి రియాలిటీ షోలలో పాల్గొన్నారు. తేరే యాన్ హూన్ మై అనే టీవీ సీరియల్‌లో కూడా నటించారు. చిన్న వయసులోనే చనిపోవడంపై తోటి నటులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

