Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganatelangana,

వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి చెరువుకు ప్ర‌భుత్వం గండి

తెలంగాణాలోని అతిపెద్ద చెరువుల్లో ఒక‌టైన వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి చెరువు ప్ర‌క్షాళ‌న ప‌నుల‌కు రేవంత్ స‌ర్కార్ న‌డుంబిగించింది.ఇందులో భాగంగా శుక్ర‌వారం తెల్ల‌వారు ఝామున చెరువుకి గండికొట్టింది.చెరువులో పూడికతీత ప‌నులు చేప‌ట్టి ,గుర్ర‌పు డెక్క‌ను తొల‌గించి, దిగువ కాల‌నీలు ముంపుకు గురికాకుండా ఉండే ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లో భాగంగా ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.రోజుకి 500 క్యూసెక్కుల నీటిని చెరువు నుంచి వ‌ద‌లనున్నారు.ఈనీటిని నాగారం చెరువుకు మ‌ళ్లిస్తున్నారు. మొత్తం 20 రోజుల లోపే చెరువుని ఖాళీ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.