Andhra PradeshHome Page Slider

ఆవులకు వైభవంగా సీమంతం

కడుపున పుట్టిన కుమార్తెకే కాదు, ప్రేమగా పెంచుకున్న ఆవులకు కూడా ఏం తక్కువ కానివ్వమని చెప్తున్నారు ఆ దంపతులు. తమ వద్ద ఉన్న రెండు ఆవులకు వైభవంగా సీమంతం వేడుక నిర్వహించారు. ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టారు. ఆవులకు చక్కగా కొత్త చీరలు కప్పి, గాజులు, పువ్వులు, నిమ్మకాయలతో అలంకారం చేశారు. ఈ సంఘటన బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెన్నుబొట్ల వారి అగ్రహారంలో జరిగింది. అక్కడ ఉన్న హనుమంతరావు, సుబ్బాయమ్మ అనే దంపతులు ఆవులను కన్నబిడ్డల్లా పెంచుకున్నారు. అందుకే వాటి అచ్చటా, ముచ్చటా తీర్చారు. వారి పిల్లలు విదేశాలలో ఉండడంతో ఆవుల పెంపకంలో, వాటి పాలనా, పోషణలో తమ జీవితాల్ని సార్థకం చేసుకుంటున్నారు.