ఆటో డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేటిఆర్
గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుఓవాలని కోరుతూ ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు దిగిన ఆటో డ్రైవర్ల సమస్య పట్ల మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ఆటో,రవాణ కార్మికులను కేవంత్ సర్కార్ దారుణంగా మోసగించిందని ఆరోపించారు. నెలకు రూ.వెయ్యి చొప్పున కార్మికులకు అందజేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోపోగా వారి పట్ల అనుచితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.ఇస్తానన్న వెయ్యి తో పాటు అదనంగా రూ.5వేలు ప్రతీ నెలా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

