Home Page SliderTelangana

మూసీ ప్రాజెక్టులో గండిపేటకు గోదావరి నీళ్లు

మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు కసరత్తులు చేస్తోంది. మూసీ నది సుందరీకరణ పనులు చేయడానికి దృఢ నిశ్చయంతో ప్రణాళికలు రచిస్తున్నారు. 15 రోజులలోపే గోదావరి నీటిని గండిపేటకు తరలించేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గండిపేట నుండి బాపూ ఘాట్ వరకూ ప్రాజెక్టు తొలిదశ పనులు చేపడతారు. అంతేకాదు, బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మూసీలో ప్రవేశించే నీటిని శుద్ధి చేయడానికి రూ.7 వేల కోట్లతో ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల మూసీ నది కాలుష్యం తగ్గనుంది.