Home Page SlidermoviesNational

వివాదంలో స్టార్ హీరో యశ్

KGF చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో యశ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నట్లయ్యింది. యశ్ తాజా చిత్రం టాక్సిక్ కోసం అడవిలో భారీ సెట్టింగ్ వేశారు. అయితే ఇది వివాదానికి దారి తీసింది. బెంగళూరులోని హెచ్‌ఎంటీ ల్యాండ్స్‌లో షూటింగ్ కోసం అక్కడ చెట్లన్నీ నరికేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. షూటింగ్ ప్రారంభానికి ముందు శాటిలైట్ చిత్రాలను, ఇప్పుడున్న పరిస్థితిని సమీక్షించారు. దీనితో చెట్లు నరికేశారని నిర్థారించుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ ప్రదేశాన్ని పరిశీలించి, చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా చెట్లు నరకడం నేరమన్నారు. 600 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటించినట్లు తెలిపారు అధికారులు. అయితే హెచ్‌ఎంటీ సంస్థ ఇప్పటికే భూమిని ప్రైవేట్ గ్రూపులకు, వ్యక్తులకు అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దర్యాప్తు జరగనుంది.