సల్మాన్‌ను చంపేస్తాం… మరోసారి బెదిరింపులు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు మరోసారి తప్పలేదు. రూ.2 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని ముంబయి పోలీసులకు అపరిచిత సందేశం వచ్చినట్లు తెలిపారు. ఇటీవల రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని డిమాండ్ లెటర్ రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. సల్మాన్‌కు భద్రత పెంచారు. ఇప్పడు మరో సందేశం రావడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు భద్రతను మరింత పటిష్టం చేశారు.