Home Page Slidertelangana,

కేసీఆర్ కుటుంబంపై సీఎం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ నేత కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది కంతా కేసీఆర్ రాజకీయం ముగుస్తుందని రేవంత్ కామెంట్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలున్నాయని, బావతో బావమరిది రాజకీయం ఇక చెల్లు అన్నారు. రాష్ట్రంలో రూ.7.5లక్షల కోట్లు అప్పులు మిగిల్చారన్నారు.  కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడానని, అలాగే త్వరలోనే కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతానని పేర్కొన్నారు. దీపావళి పార్టీ అంటూ, క్యాసినో కాయిన్లతో పార్టీ చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాజ్ పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయన్నారు. హైడ్రాపై, మూసీ పునరుజ్జీవనంపై బీఆర్‌ఎస్ పార్టీ విషప్రచారం చేస్తోందన్నారు.