తిరుపతిలో బాంబుల కలకలం
ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ఆయా హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటళ్లకు ఈ బెదిరింపులు వచ్చాయి. డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించిన పోలీసులు బాంబులు లేవని తేల్చారు. వాటిని ఫేక్ మెయిల్స్‌గా నిర్థారించారు. అయితే 4రోజుల మందు కూడా ఇలా 4 హోటళ్లకు బెదిరింపులు రావడంతో వీటిపై కేసులు నమోదు చేశారు.