అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ఏపీలో అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి కనెక్టివిటీ ఇన్వెస్ట్మెంట్ పేరిక రూ.2,245కోట్లతో 57 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్, చెన్నై,కోల్‌కతాల నుండి అమరావతికి రైల్వేను అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టును చేపడతారు.

సెంట్రల్, నార్తర్న్, సదరన్ రైల్వేల నుండి ఈ మార్గాన్ని కలుపుతారు. అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి దేవస్థానం, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద విగ్రహం, ఉండవల్లి గుహలు కూడా ఈ రైల్వే మార్గంలో దర్శించవచ్చు. మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను కూడా అనుసంధానిస్తారు. కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జి నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అవతరించిన అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

