బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ ధర
పెళ్లిళ్ల సీజన్ వేళ మరోసారి బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు షాకయ్యారు. 10గ్రా. గోల్డ్ రేట్ రూ.80వేలు దాటింది. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా. ధర రూ.430 పెరిగి రూ.80,070గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రా. ధర రూ. 400 పెరిగి రూ.73,400గా నమోదైంది. అటు వెండి రేటు కూడా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.2000 పెరిగి రూ.1,12,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

