హమాస్ చీఫ్ బంకర్‌లో కోట్ల కొద్దీ డబ్బు
ఇటీవల ఇజ్రాయెల్ సైనిక చర్యలో హమాస్ చీఫ్ సిన్వార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన ఒక బంకరును ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వీడియో తీసింది. గాజాలోని ఉన్న ఖాన్ యూనిస్ బంకర్‌లో కట్టలు కట్టలుగా మిలియన్ డాలర్ల భారీ నగదు లభ్యమయ్యింది. సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ బంకర్‌లో బస చేసినట్లు తెలిపారు. ఆయుధాలు, ఐక్యరాజ్య సమితి రిలీఫ్ ఫండ్స్ బ్యాగులు అక్కడ ఉన్నాయి. ఆధునిక వంటసామాగ్రి, బాత్ రూమ్స్ వంటి సకల సౌకర్యాలు ఆ బంకరులో ఉండడంతో ఆశ్చర్యపోయారు ఇజ్రాయెల్ అధికారులు. గాజా పౌరులను అడ్డుపెట్టుకుని పిరికివాడిలా భూగర్భంలో తలదాచుకున్నాడని వారు వ్యాఖ్యానించారు. పైగా ఆయన కుటుంబంతో బంకరులోకి వెళ్లే క్రమంలో ఆయన భార్య వద్ద దాదాపు రూ.27 లక్షల విలువైన హ్యాండ్‌బ్యాగ్ కనిపించడం కూడా విచిత్రంగా అనిపించింది.

