ఇంటర్ విద్యార్థినిపై దారుణం
కడప జిల్లాలోని బద్వేలు సెంచరీ ప్లైవుడ్ వద్ద ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి జరిగింది. విఘ్నేష్ అనే యువకుడు విద్యార్థినిపై ఈ దారుణ ఘటనకు ఒడిగట్టారు. విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనితో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. తమ కుమార్తెను 8 వ తరగతి నుండే ప్రేమ పేరుతో విఘ్నేష్ వేధించేవాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అతడికి వివాహం కూడా జరిగిందని సమాచారం. తనను కలవకపోతే చనిపోతానంటూ ఫోన్ చేసి ఆమెను రప్పించాడు. ఈ సమయంలో పెట్రోల్ పోసి పరారయ్యాడు. బాధితురాలు 80 శాతం గాయాలయ్యాయి. నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలింపు చేపట్టాం అని పోలీసులు తెలిపారు.

